Vishwak Sen Mechanic Rocky Trailer out now
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
Unstoppable Season 4 : అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ మొదలు.. సీఎంతో బాలయ్య ఫోటోలు వైరల్..
నువ్వు ఏం భయపడకు నాన్న. నేను ఎలాగైనా సివిల్ ఇంజనీర్‌ను అవుతా అని విశ్వక్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కంప్యూటర్స్ చదివి సివిల్ ఇంజినీర్ అవుతా అంటూ నరేశ్ అన్నాడు. మొత్తంగా విశ్వక్ కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలలోనూ అదరగొట్టాడు. సునీల్ విలన్‌గా నటించినట్లుగా ట్రైలర్‌లో తెలుస్తోంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.