Ashoka Vanamlo Arjuna Kalyanam
Vishwak Sen: విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ అయింది అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ కొత్తగా ట్రై చేయాలనుకుని, కాంట్రవర్శిలో చిక్కుకున్న విశ్వక్.. కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అయ్యాడు. మొత్తంగా సినిమా అయితే సక్సెస్ కొట్టాడు. ఒకవైపు పాజిటివ్ రివ్యూలు దక్కించుకోవడంతో పాటు సినిమా చూసిన ప్రేక్షకులు గుడ్ ఎంటర్ టైనర్ గా సర్టిఫికెట్ ఇచ్చేశారు.
Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?
ఇప్పటి వరకు మాస్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం క్లాస్‌గా కనిపించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. అంచనాలను తగ్గట్లే అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద భారీ సినిమా అయినా 3 నెలలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాలైతే నెల తిరగకుండానే ఓటీటీలో దిగిపోతున్నాయి.
Ashoka Vanamlo Arjuna Kalyanam : ‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా?..నా జీవితంతో ఆటాడుతావా?’..
అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాను ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. కాగా, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తుంది. అంటే దీనిని బట్టి జూన్ మొదటి వారంలో ఆహాలో విడుదల కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.