Vishwak Sen new getup for his VS11 movie
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే డైరెక్షన్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాగా విశ్వక్ ఇటీవలే రెండు కొత్త సినిమాలు ప్రకటించాడు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఒక సినిమా (VS10), చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో మరో సినిమా (VS11) ఓకే చేశాడు. VS11 మూవీని ఇవాళ పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశాడు.
Chandrabose : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌కి ఆస్ట్రేలియా ప్రభుత్వం సత్కారం..
ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో విశ్వక్ ఒకే లుక్ లో కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ మూవీ కోసం డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. షార్ట్ హెయిర్ తో, గడ్డం మీసాలతో ఊర మాస్ లుక్ లోకి వచ్చేశాడు. విశ్వక్ మాక్ ఓవర్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ఇటీవలే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ తో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కథ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలోని విశ్వక్ సేన్ క్యారెక్టర్ కొంచెం నెగటివ్ షేడ్స్ తో ఉంటుంది అంటూ గ్లింప్స్ తో తెలియజేశారు మేకర్స్.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ మూడు ప్రొడక్షన్ కంపెనీలు తెరకెక్కించిన సార్ (Sir) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. అటువంటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి మరో హైలైట్ ఏంటంటే.. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించబోతున్నాడు. అంజలి హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
Mass Ka Das @VishwakSenActor ~ #VS11 Begins! ?
Shoot commences from Mid of May 2023! ❤️?
? @thisisysr
✍️& ? #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/wLWnHwAg0b— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2023