Vishwak Sen : సుమక్కకి పోటీగా యువ హీరో..

యువ హీరో విశ్వక్‌సేన్‌ తాజాగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో రాబోతున్నాడు. రుష్కర్ దిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను..........

Vishwak Sen : సుమక్కకి పోటీగా యువ హీరో..

Vishwak

Updated On : March 15, 2022 / 2:03 PM IST

Vishwak Sen :  యువ హీరో విశ్వక్‌సేన్‌ సినిమా సినిమాకి తన క్యారెక్టర్ తో పాటు సినిమా కథల్లోనూ వ్యత్యాసం చూపిస్తున్నాడు. కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించి అభిమానులని పెంచుకుంటున్నాడు. తాజాగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో రాబోతున్నాడు. రుష్కర్ దిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తుండగా విద్యా సాగర్ తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాని గతంలోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా భారీ సినిమాలు ఉండటంతో వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. కొత్త పోస్టర్ ని సినిమా రిలీజ్ డేట్ తో విడుదల చేసింది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

Suma Kanakala : ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ సినిమాల మధ్యలో సుమక్క సినిమా

అయితే అదే రోజు సినిమాలేవీ లేవని ధైర్యంగా యాంకర్ సుమ తాను మెయిన్ లీడ్ లో చేస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. కానీ తాజాగా విశ్వక్ సేన్ తన సినిమాని కూడా ఏప్రిల్ 22న ప్రకటించడంతో సుమకి పోటీ ఇవ్వనున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులని ఏది మెప్పిస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)