Vishwak Sen : భగవద్గీతని ప్రచారం చేస్తున్న విశ్వక్ సేన్..

భగవద్గీతని ప్రచారం చేస్తున్న విశ్వక్ సేన్. సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనాన్ని తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్..

Vishwak Sen promotes RP Patnaik bhagavad gita recording

Vishwak Sen : సాధారణ ప్రజలకు కూడా భగవద్గీత తాత్పర్యం తెలియజేసేలా.. గతంలో తెలుగు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల తన గాత్రంలో గంట పై ఆడియోని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. తన అద్వర్యంలో సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనాన్ని రికార్డు చేసారు.

ఇక ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం రికార్డుని టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఇలాంటి వేడుకలో భాగం కావాలంటే రాసి పెట్టి ఉండాలి. నాకు దక్కిన ఈ అవకాశాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇక భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రికార్డింగ్ ని కేవలం పాడ్ కాస్ట్ లా వినడమే అనుకున్నాను. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతకి చాలా చక్కగా అర్థమయ్యేలా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు” అంటూ వ్యాఖ్యానించారు.

Also read : Pavala Syamala : అందరి హీరోలతో నటించా.. కానీ చివరికి నా జీవితం.. పావలా శ్యామల ఆవేదన..

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ కార్యాన్ని తన చేత ఆ భగవంతుడే చేయించాడని, తాను కేవలం నిమిత్తమాత్రుడినే అంటూ చెప్పుకొచ్చారు. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ అర్ధమైయ్యేలా సులువుగా ఉంటుంది. ఆ భగవద్గీతనే వారి అనుమతి తీసుకోని రికార్డు చేసినట్లు పట్నాయక్ చెప్పుకుకొచ్చారు. ఇక ఈ రికార్డింగ్ ని జానకీరామ్ తన అద్భుతమైన విజువల్స్ తో అందరికి మరింత చేరువయ్యేలా చేసారని, ఇందుకోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేసారని పేర్కొన్నారు.