Mallidi Krishna : ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ట సోదరుడు డైరెక్టర్ గా ఎంట్రీ.. మొదటి సినిమా ఓపెనింగ్..
వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

Vishwambhara Director Vassishta Brother Mallidi Krishna Introducing as Director
Mallidi Krishna : బింబిసార సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు మెగాస్టార్ తో విశ్వంభర సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ మల్లిడి వశిష్ట. ఇప్పుడు వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.లతా రాజు నిర్మాణంలో మల్లిడి కృష్ణని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నేడు కొత్త సినిమా ఓపెనింగ్ చేసారు. కుశాల్ రాజు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. స్కైఫై డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించగా స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్.. పలువురు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బబ్లూ పృథ్వీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. 2012లో నా జర్నీ మొదలైంది. అప్పట్నుంచి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు డైరెక్టర్‌గా వస్తున్నాను. ఇదొక స్కైఫై డ్రామా సినిమా అని తెలిపారు. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నా హెయిర్ స్టైల్ మార్చాను. ఇందులో నాది పాజిటివ్ క్యారెక్టర్. యానిమల్ సినిమా తర్వాత నా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం నేను 19 సినిమాలు చేస్తున్నా. అందులో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని అన్నారు.
హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ.. నా డైరెక్టర్ కృష్ణకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లతగారు చాలా కేర్ తీసుకున్నారు అని అన్నారు. నిర్మాత డాక్టర్ లతారాజు మాట్లాడుతూ.. నిర్మాతగా నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. మా అబ్బాయి కోరిక మేరకు నేను నిర్మాత అయ్యాను. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది అని తెలిపారు.