Vishwambhara ttitle glimpse concept Director going to be direct akkineni akhil with socio fantasy film
Anil Kumar : ఇటీవల మెగా 156 సినిమా టైటిల్ ‘విశ్వంభర'(Vishwambhara) అంటూ ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వంలో చాలా ఆసక్తిగా ఈ గ్లింప్స్ ని తయారు చేసి టైటిల్ ని ప్రకటించారు. విశ్వంభర సోషియో ఫాంటసీ సినిమాగా రానుంది. బింబిసార డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల వచ్చిన గ్లింప్స్ కాన్సెప్ట్ మాత్రం వేరే డైరెక్టర్ ది.
సినీ పరిశ్రమలో రచయిత, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో పని చేసిన అనిల్ కుమార్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్(UV Creations) సినిమాలకు పని చేస్తున్నాడు. సాహో సినిమాకు కూడా ఇతను రచయితగా, అసోసియేట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసాడు. ఇప్పుడు విశ్వంభర సినిమాకు కూడా సహా రచయితగా పని చేస్తున్నాడు. అతనే ఈ విశ్వంభర గ్లింప్స్ కాన్సెప్ట్ ని తయారుచేశాడు.
Also Read : Chiranjeevi : మెగా వారసులతో చిరంజీవి సెల్ఫీ.. అన్నదమ్ములు చరణ్, వరుణ్, అకిరా..
అయితే ఈ అనిల్ కుమార్ దర్శకత్వంలో మన అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా సినిమా రాబోతుందని సమాచారం. అఖిల్ కి ఇప్పటివరకు కెరీర్ లో సరయిన హిట్ ఒక్కటి పడలేదు. రెండు సినిమాలు యావరేజ్ కాగా మిగిలినవి ఫ్లాప్స్ గానే మిగిలాయి. గత సినిమా ఏజెంట్ అయితే దారుణమైన పరాజయం చూసింది. ఆ తర్వాత అఖిల్ ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు. అనిల్ కుమార్ చెప్పిన ఓ సోషియో ఫాంటసీ కథకు అఖిల్ ఓకే చెప్పినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది మరోసారి వైరల్ అవుతుంది. విశ్వంభర గ్లింప్స్ వైరల్ అవ్వడంతో అదే రేంజ్ లో అనిల్ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అఖిల్ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా అయినా వర్కౌట్ అయి అఖిల్ కి పెద్ద హిట్ వస్తుందేమో చూడాలి. ఇక ఇటీవలే అఖిల్ ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ పార్టీలో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.