గీతాంజలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజకిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వామిత్ర’. గీతాంజలి, త్రిపుర వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజకిరణ్ తీస్తున్న థ్రిల్లర్ చిత్రం ఇదే.
గీతాంజలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజకిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వామిత్ర’. గీతాంజలి, త్రిపుర వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజకిరణ్ తీస్తున్న థ్రిల్లర్ చిత్రం ఇదే. ఈ సినిమాలో నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖారామన్, ప్రసన్నకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొదలు
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జోనర్ సినిమాలదే హవాగా ఉంది. ఒక యధార్థ ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అది ఇప్పటికి తీరింది. యు.ఎస్.లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివి దాన్ని ఆధారంగా ఈ కథను తయారు చేసుకున్నాను.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. అంతేకాదు అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది అని అన్నారు.
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా