Guppedantha Manasu
Guppedantha Manasu : విష్ కాలేజ్ ఆహ్వానంపై రిషి, వసుధరలు అక్కడికి వెళ్తారు. వీరిద్దరిని అక్కడ జంటగా చూసిన విశ్వనాథం, ఏంజెల్ షాకవుతారు. ఏంజెల్ కోపంతో రగిలిపోతుంది. విశ్వనాథం రిషి,వసుధరలను తమ ఇంటికి రమ్మంటాడు. మరోవైపు అనుపమ కూడా విశ్వనాథం ఇంటికి వస్తుంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
Guppedantha Manasu : రిషి, వసుధరల ఫస్ట్ నైట్.. జగతి వారికి బిడ్డగా పుట్టాలని కోరుకున్న మహేంద్ర..
రిషి, వసుధరలు జగతిని షూట్ చేసిన ప్రాంతానికి వెళ్తారు. అప్పటికే అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ ముకుల్ ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. రిషి, వసుధరలని ఆరోజు జరిగిన సంఘటన గురించి ప్రశ్నిస్తాడు. ముకుల్ డ్రైవర్‌కి ఫోన్ చేసిన శైలేంద్ర అక్కడేం జరుగుతోందో వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ చెబితే డ్రైవర్‌కి మరిన్ని డబ్బులు పంపిస్తానని ఆశ పెడతాడు. ముకుల్ ఈ కేసుని చాలా పర్సనల్‌గా తీసుకుని పనిచేస్తున్నారని శైలేంద్రకి చెబుతాడు డ్రైవర్. జగతిని షూట్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేస్తే అతను చనిపోయాడని తెలిసిందని.. అతని మొబైల్ ఫోన్ నుంచి కాల్ డేటా రికవర్ చేస్తున్నామని.. కిల్లర్ మర్డర్ చాలా ప్లాన్డ్‌గా చేశాడని.. చిన్న క్లూ కూడా వదలకుండా జాగ్రత్త పడ్డాడని ముకుల్ రిషికి చెబుతాడు. కాస్త లేటైనా తన తల్లిని చంపిన వ్యక్తిని కనిపెట్టమని ముకుల్‌కి చెబుతాడు రిషి. అక్కడి నుంచి రిషి, వసుధర విష్ కాలేజీకి వెళ్తారు.
Guppedantha Manasu : రిషికి చక్రపాణి చెప్పిన రహస్యం ఏంటి? వసుధరను రిషి ఎందుకు క్షమాపణ అడుగుతాడు?
విష్ కాలేజీ స్టాఫ్ రిషి, వసుధరలకు పూల దండ వేసి ఆహ్వానిస్తారు. అక్కడికి వచ్చిన విశ్వనాథం, ఏంజెల్ రిషి, వసుధరలని జంటగా చూసి షాకవుతారు. ఏంజెల్ కోపంతో రగిలిపోతుంది. లోపలికి వెళ్లిన తర్వాత అందరూ రిషి, వసుధర తమ కాలేజీకి చేసిన సర్వీసుని గుర్తు చేసుకుంటారు. అక్కడి నుంచి వెళ్లబోతూ విశ్వనాథం రిషిని తమ ఇంటికి రమ్మని వెళ్తాడు. విశ్వనాథం ఇంటికి వచ్చిన అనుపమ లోనికి వెళ్తుంది. అనుపమ ఎవరో తెలియక పనిమనిషి ఇంట్లో ఎవరూ లేరని చెబుతుంది. పైన క్లోజ్డ్ రూమ్ తాళాలు ఇమ్మని అడుగుతుంది అనుపమ. అసలు విశ్వనాథం ఇంటికి అనుపమ ఎందుకు వచ్చింది? ఆ కుటుంబంతో ఆమెకు రిలేషన్ ఏంటి? రిషి, వసుధరలు విశ్వనాథం ఇంటికి వెళ్తారా? ఉత్కంఠగా సాగుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.