Katha Venuka Katha : ‘కథ వెనుక కథ’ మూవీ రివ్యూ.. ఓటీటీలో మరో సస్పెన్స్ థ్రిల్లర్..

'కథ వెనుక కథ' సినిమా ఓ క్రైం థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు నచ్చేవాళ్ళు ఈ సినిమాని చూసేయొచ్చు.

Viswant Duddumpudi Katha Venuka Katha Crime Thriller Movie Streaming in ETV Win Review and Rating

Katha Venuka Katha Review : విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కథ వెనుక కథ’. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై దండమూడి అవనీంద్ర కుమార్ ఈ సినిమాని నిర్మించారు. శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఈ విన్ ఓటీటీలోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. అశ్విన్(విశ్వంత్) డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. తన మరదలిని(శ్రీజిత గౌష్) ప్రేమిస్తే ఏదైనా సాధించి వస్తే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు అశ్విన్ మామ. దీంతో దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూ ఓ అవకాశం తెచ్చుకుంటాడు. సినిమా షూటింగ్ అయ్యాక సినిమా రిలీజ్ కి సమస్యలు వస్తాయి. అదే సమయంలో అశ్విన్ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ తో పాటు మరికొంతమంది మిస్ అవుతారు. అప్పుడే సిటిలో కొంతమంది అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. వాటిని డీల్ చేయడానికి ఓ స్పెషల్ పోలీసాఫీసర్(సునీల్) వస్తాడు. అశ్విన్ కి, ఆ హత్యలకు సంబంధం ఏంటి? అశ్విన్ తన మరదలిని పెళ్లి చేసుకున్నాడా? డైరెక్టర్ గా అశ్విన్ సినిమా రిలీజయిందా? అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? మిస్ అయిన హీరో, హీరోయిన్స్ దొరుకుతారా?.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఒక క్రైం తో సినిమాని మొదలుపెట్టి ఆ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్తారు. హీరో, అతని గురించి చూపిస్తారు. మొదటి 20 నిముషాలు కొంచెం స్లోగా సాగుతుంది. ఆ తర్వాత హీరోకి సినిమా ఛాన్స్ రావడం.. అంటూ సాగి ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఇస్తారు. మధ్యలో అక్కర్లేకపోయినా కమర్షియాలిటీ కోసం ఓ ఐటెం సాంగ్ పెట్టినట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం హత్యలు, ట్విస్ట్ లు, వాటిని రివీల్ చేయడం అంటూ ఆసక్తిగా సాగుతుంది. మొదటి నుంచి థ్రిల్లింగ్ గా సాగి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు అన్ని సెకండ్ హాఫ్ చివర్లో రివీల్ చేయడం గమనార్హం. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగుంటాయి.

Also Read : Family Star : ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌.. అప్పుడు గీతగోవిందం..

నటీనటుల విషయానికొస్తే.. విశ్వంత్ ఇప్పటికే చాలా సినిమాలతో మెప్పించాడు. ఈ సారి కొత్తగా క్రైం థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ వైపు డైరెక్టర్ అవ్వాలనే కసి ఉన్న కుర్రాడిగా, మరో వైపు ఈ క్రైం కథతో మెప్పించాడు. సునీల్ పోలీసాఫీసర్ గా సీరియస్ పాత్రలో మెప్పించాడు. శ్రీజిత ఘోష్ హీరో మరదలి పాత్రలో ఓకే అనిపిస్తుంది. బిగ్ బాస్ శుభశ్రీ, అలీ, మధునందన్, సత్యం రాజేష్.. ఇలా మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

సాంకేతిక అంశాలు.. థ్రిల్లింగ్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. సాంగ్స్ మాత్రం యావరేజ్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. కథ, కథనం రెండూ కూడా కొత్తగా ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొంచెం బోర్ కొట్టేలా అంటుంది స్క్రీన్ ప్లే. దర్శకుడిగా కృష్ణ చైతన్య పర్వాలేదనిపించాడు. చిన్న సినిమా అయినా దానికి తగ్గట్టు నిర్మాణం పరంగా ఖర్చు బాగానే పెట్టారు.

మొత్తంగా ‘కథ వెనుక కథ’ సినిమా ఓ క్రైం థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు నచ్చేవాళ్ళు ఈ సినిమాని చూసేయొచ్చు. ఇటీవల కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తున్న ఈ విన్ యాప్ ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు