Family Star : ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌.. అప్పుడు గీతగోవిందం..

ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌ గా రాబోతున్నారా.. అప్పుడు గీతగోవిందం..

Family Star : ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి చీఫ్ గెస్ట్‌.. అప్పుడు గీతగోవిందం..

Chiranjeevi came for Chief guest for Vijay Deverakonda Family Star pre release event

Updated On : March 30, 2024 / 9:44 PM IST

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో విజయ్ అండ్ పరుశురాం కాంబినేషన్ లో ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను అందుకోవడం కోసం విజయ్ అండ్ పరుశురాం బాగా కష్టపడుతున్నారు.

ఈ మూవీ వచ్చే వారం ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. గతంలో గీతగోవిందం సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరయ్యి విజయ్ ని అభినందించారు. ఇప్పుడు మూవీ రిలీజ్ కి ముందే వచ్చి విజయ్ ని అభినందించడం కోసం రాబోతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాలి.

Also read : Allu Arjun : ‘ఆర్య’ రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌తో పాటు రీ రిలీజ్ ప్లాన్..

కాగా ఈ మూవీని ఇప్పుడు తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారలు తరువాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం. గీతగోవిందంతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడంతోనే.. ప్రస్తుతం విజయ్ ప్లాప్స్ లో ఉన్న ఇంతటి బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మరి విజయ్ అండ్ పరుశురాం తమ పై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటారేమో చూడాలి.