రూ.200 కోట్ల క్లబ్‌లో విశ్వాసం

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు, రూ.180 కోట్లు కొల్లగొట్టిన విశ్వాసం.. మరికొద్ది రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవబోతుంది.

  • Published By: sekhar ,Published On : February 1, 2019 / 07:40 AM IST
రూ.200 కోట్ల క్లబ్‌లో విశ్వాసం

Updated On : February 1, 2019 / 7:40 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు, రూ.180 కోట్లు కొల్లగొట్టిన విశ్వాసం.. మరికొద్ది రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవబోతుంది.

తళ అజిత్, నయనతార జంటగా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన విశ్వాసం, సంక్రాంతి కానుకగా, జనవరి 10న, తమిళనాట గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడంతో, రోజు రోజుకీ థియేటర్స్ పెంచుకుంటూ.. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అదరగొట్టేసింది. ప్రస్తుతం నాలుగవ వారంలోకి ఎంటరైన విశ్వాసం.. తమిళనాడుతో పాటు, ఓవర్సీస్‌లోనూ అత్యధిక వసూళ్ళు రాబట్టింది. మూడవ వారం నాటికి ఒక్క మలేషియాలోనే.. రూ.10.37 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు, రూ.180 కోట్లు కొల్లగొట్టిన విశ్వాసం.. మరికొద్ది రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవబోతుంది.

ఇది అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. అజిత్ మాస్ ఇమేజ్‌ని మరింత పెంచిన సినిమా ఇది.. మరో రెండు వారాల పాటు, ఎటువంటి అభ్యంతరం లేకుండా విశ్వాసంని ప్రదర్శించడానికి తమిళనాట థియేటర్ ఓనర్స్ సిద్ధమవ్వడం విశేషం. వీరం, వేదాళం, వివేగం తర్వాత, అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో రూపొందిన నాలుగవ సినిమా ఇది.  విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న విశ్వాసంలో అజిత్ డ్యుయెల్ రోల్ చేసాడు.

వాచ్ విశ్వాసం తమిళ ట్రైలర్…