Sound Party : బిగ్‌బాస్ విన్నర్ VJ సన్నీ నెక్స్ట్ సినిమా ‘సౌండ్ పార్టీ’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

బిగ్‌బాస్ విన్నర్ VJ సన్నీ కొత్త సినిమా సౌండ్ పార్టీ రిలీజ్ డేట్ అనౌన్స్.

Sound Party : బిగ్‌బాస్ విన్నర్ VJ సన్నీ నెక్స్ట్ సినిమా ‘సౌండ్ పార్టీ’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

VJ Sunny Hrithika Srinivas Sound Party movie release date announced

Sound Party : యాంకర్, సీరియల్ నటుడు VJ సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా నిలిచిన తర్వాత హీరోగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాల్లో నటించాడు VJ సన్నీ. ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది.

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంజ‌య్ శేరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేశాయి. ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

VJ సన్నీ సౌండ్ పార్టీ సినిమా వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ… ఇప్ప‌టికే విడుద‌లైన మా ‘సౌండ్ పార్టీ’ సినిమా టీజ‌ర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు నెలకొల్పాయి. బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్, VJ సన్నీ, శివ‌న్నారాయ‌ణ కామెడీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రస్తుతం ప్రేక్షకులు, ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు. ఆ త‌ర‌హాలోనే తెర‌కెక్కిన మా సౌండ్ పార్టీ సినిమాని కూడా ప్రేక్ష‌కులు ఆదరిస్తారని న‌మ్మ‌కంతో ఉన్నాం. ఈ నెల 24న గ్రాండ్ గా సౌండ్ పార్టీ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం అని తెలిపారు.

Also read : Pongal 2024 : పొంగల్ రేసు నుంచి ఒక సినిమా అవుట్..! ఆ స్టార్ హీరో పరిస్థితి ఏంటి..?

ఇక ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడు జ‌యశంక‌ర్ మాట్లాడుతూ… పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం అని అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ… నిర్మాత‌లు ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగాను. ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగాను. ఇప్ప‌టికే టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నవంబర్ 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.