VTV Ganesh
VTV Ganesh : తమిళ్ స్టార్ కమెడియన్ వీటీవి గణేష్ ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు సినిమాల్లో ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ సినిమా టీమ్ తో ఆయన ఫోన్ లో గొడవ పడ్డ వీడియో వైరల్ గా మారింది.(VTV Ganesh)
కెవిన్, ప్రీతీ అస్రాని జంటగా తెరకెక్కిన తమిళ సినిమా కిస్ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీలోకి కూడా ఈ సినిమా డబ్బింగ్ తో రిలీజ్ కానుంది. అయితే తెలుగు డబ్బింగ్ లో వీటీవి గణేష్ పాత్రకు ఆయనకు బదులు ఇంకొకరితో డబ్బింగ్ చెప్పించారని సమాచారం.
దీంతో వీటీవి గణేష్ ఆ మూవీ యూనిట్ కి ఫోన్ చేసి.. నాకు తెలుగు మెయిన్. తెలుగులో నేనే డబ్బింగ్ చెప్తాను. నాకు కేవలం రెండు గంటలు సరిపోతుంది తెలుగు డబ్బింగ్ చెప్పడానికి. నా కెరీర్ నాశనం చేయొద్దు ప్లీజ్ అని అడుగుతూ గొడవపడ్డారు. వీటీవి గణేష్ ఫోన్ లో మాట్లాడుతుండగా ఎవరో తీసిన వీడియో లీక్ అయి వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో తన పాత్ర మీద, సినిమా మీద తనకు ఉన్న డెడికేషన్ చూసి వీటీవి గణేష్ ని పలువురు అభినందిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగమే, ఇలా కొత్తగా కాంట్రవర్సీతో ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.
“Don’t spoil my career..please”-#VTVGanesh talking to the team about dubbing issue of his voice on Telugu version of #Kiss film ahead of the release this week!#Kavin #PreethiAsrani #Galatta pic.twitter.com/Tt5zqmDYir
— Galatta Media (@galattadotcom) September 17, 2025
Also See : Shivathmika Rajashekar : చీరలో సింపుల్ లుక్స్ తో అలరిస్తున్న శివాత్మిక..