MissingMeghana : సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా మిస్సింగ్ మేఘ‌న‌.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన (MissingMeghana).

VV Vinayak launches the first look poster of MissingMeghana

MissingMeghana : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వాచస్పతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు కీల‌క పాత్ర‌ల‌నె పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ ను వీవీ వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు నిర్మా బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

ఫ‌స్ట్ లుక్ విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ ల స‌హ‌కారంతో ద‌ర్శ‌కుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నార‌ని అన్నారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని, హీరోకి, ద‌ర్శ‌కుడికి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. మొత్తంగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Eesha Rebba : బ్లాక్ డ్రెస్‌లో గోల్డెన్ హార్ట్.. తెలుగు అందం ఈషా రెబ్బ స్ట‌న్నింగ్‌ ఫోటోలు..

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. వి.వి.వినాయక్ ది గోల్డెన్ హ్యాండ్ అని, ఆయ‌న చేతుల మీదుగా త‌మ సినిమా పోస్ట‌ర్ లాంఛ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ప్రేక్షకులకు న‌చ్చే అంశాలు అన్ని ఈ చిత్రంలో ఉంటాయ‌న్నారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. చిత్ర బృందం త‌రుపున వి.వి.వినాయక్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు వాచస్పతి కి ప్రొడ్యూసర్ నరేష్ కి ధన్యవాదాలు తెలియ‌జేశారు. ప్రేక్ష‌కుల అంద‌రికి ఈ చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌న్నారు.