Jagadeka Veerudu Athiloka Sundari : వైజయంతి నిర్మాతలు వార్నింగ్ నోట్.. ఎవరికి ఈ వార్నింగ్..?

వైజయంతి నిర్మాతలు జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ గురించి ఒక వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు.

Jagadeka Veerudu Athiloka Sundari : వైజయంతి నిర్మాతలు వార్నింగ్ నోట్.. ఎవరికి ఈ వార్నింగ్..?

Vyjayanthi Movies warning note on Jagadeka Veerudu Athiloka Sundari

Updated On : October 10, 2023 / 5:51 PM IST

Jagadeka Veerudu Athiloka Sundari : మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఇది ఒక కల్ట్ క్లాసిక్ గా ఉండి పోయింది. కాగా తాజాగా వైజయంతి నిర్మాతలు ఈ మూవీ గురించి ఒక వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు.

జగదేకవీరుడు అతిలోకసుందరికి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని తమవే అని, వారి ప్రమేయం లేకుండా.. ఆ మూవీలోని కంటెంట్ ఏ రకంగా ఇతరులు వాడుకోవడానికి వీలులేదు. ఆ కథని ఆధారంగా తీసుకోని ప్రీక్వల్ గాని, సీక్వెల్ గాని, వెబ్ సిరీస్ గాని తీసే హక్కు ఎవరికి లేదంటూ పేర్కొంది. ఒకవేళ ఎవరైనా అతిక్రమించి ఏమన్నా చేస్తే.. వారిపై లీగల్ యాక్షన్ తీసుకునే హక్కు తమకి ఉందంటూ ఒక వార్నింగ్ నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Salaar : సలార్ నుంచి ఫైట్ సీన్ లీక్..? మూవీ నిర్మాతల ట్వీట్ వైరల్..!

అయితే ఇంత సడన్ గా ఈ వార్నింగ్ ఎవరి కోసం ఇచ్చారో అన్నది తెలియలేదు. దీంతో గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. కొందరు నెటిజెన్స్ రాబోయే పలు సినిమాల గురించి చెబుతూ.. వాటిలో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ కంటెంట్ ని ఉపయోగిస్తున్నారు అందుకనే ఈ నోట్ రిలీజ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి 157వ సినిమాకి కూడా ఈ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు.