Dasari Kiran Arrest: వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత దాసరి కిరణ్ ను విజయవాడ పడమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాసరి కిరణ్‍ను హైదరాబాద్‍లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడ తరలించారు. బంధువుల దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాలని అడిగినందుకు దాడి చేయించారని దాసరి కిరణ్ పై ఆరోపణలు ఉన్నాయి.
రుణం తీసుకున్న రూ.5 కోట్లు చెల్లించాలని దంపతులు కిరణ్ ను కోరారు. దీంతో దంపతులపై తన అనుచరులతో కిరణ్ దాడి చేయించారని ఆరోపణలు ఉన్నాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాసరి కిరణ్ ను అరెస్ట్ చేశారు.
దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. జగన్ ను హైలైట్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను అవహేళన చేస్తూ.. దాసరి కిరణ్ సినిమాలు తీశారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిపోవడంతో దాసరి కిరణ్ పై ఫోకస్ పడింది. ఏదో ఒక విషయంలో, ఎప్పుడో ఒకసారి ఆయనను అరెస్ట్ చేస్తారని అందరూ ఊహించినట్లే.. రుణం ఎగవేయడంతో పాట దాడులు చేయించారనే కేసు నమోదు కావడంతో.. ఏపీ పోలీసులు దాసరి కిరణ్ ను అరెస్ట్ చేశారు.
Also Read: అంతా అయిపోయాక ఇప్పుడెందుకు? కూలీ కోసం కోర్టుకెళ్లిన నిర్మాత.. ఇదేదో ముందే చెయ్యాల్సింది..