Waltair Veerayya Vs Veera Simha Reddy Becomes Hot Topic In Tollywood
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు పోటీగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే ల్యాండ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య రన్‌టైమ్ ఫిక్స్ చేశాడా..?
అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా షురూ చేశారు చిత్ర యూనిట్స్. ఇటీవల బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుండి సుగుణ సుందరి అంటూ రెండో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా, తాజాగా వాల్తేరు వీరయ్య మరో కొత్త పోస్టర్ వదిలి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే హైప్ క్రియేట్ చేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకెళ్తుండటంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
Veera Simha Reddy : ‘సుగుణ సుందరి’ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదరగొట్టేసాడుగా..
కాగా, ఈ సంక్రాంతి పండగకు ఏ హీరో పైచేయి సాధిస్తాడా అని అప్పుడే లెక్కలు కూడా వేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా, మధ్యలో ఓ తమిళ హీరో కూడా వీరికి పోటీ వస్తుండటంతో సంక్రాంతి పండగ సీజన్ రసవత్తరంగా మారిపోయిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక చిరంజీవి, బాలయ్య సినిమాల్లో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తుండటం విశేషం.