Waltair Veerayya : ఫ్రాన్స్‌కి వెళ్లనున్న వాల్తేరు వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజులు తరవాత ఒక కంప్లీట్ మాస్ రోల్ లో నటిస్తున్న మూవీ 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మరియు బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్..

Waltheru Veeraiah is going to France for song shoot
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజులు తరవాత ఒక కంప్లీట్ మాస్ రోల్ లో నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మరియు బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Waltair Veerayya: వీరయ్య సింగిల్‌గానే వచ్చి వాయిస్తాడా..?
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ ఫ్రాన్స్‌కి వెళ్లే ఆలోచనలో ఉందట. ఈ నెల 8న మూవీ టీమ్ ఫ్రాన్స్‌కి వెళ్లి వారంరోజుల్లో సాంగ్ షూట్ పూర్తి చేసుకొని తిరిగి రావడానికి షెడ్యూల్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది అంటూ మేకర్స్ తెలిపినప్పటికీ, కచ్చితమైన డేట్ అయితే ప్రకటించ లేదు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తరవాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉందట టీమ్. కాగా ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం వికారాబాద్ శివారులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ.