Salman Khan
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి గత కొంతకాలంగా థ్రెట్ ఉన్న సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బహిరంగంగానే ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ కొనుక్కొని ప్రైవేట్, గవర్నమెంట్ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు.
ఇటీవల కెనడాలోని కమెడియన్, యాంకర్ కపిల్ శర్మ హోటల్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
Also Read : Anchor Ravi : పెద్ద డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్న వేషం అయినా ఇమ్మని అడిగా.. ఆయన ఏమన్నాడంటే..
ఆ ఆడియో క్లిప్ ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి దాన్ని రికార్డ్ చేసాడు. సల్మాన్ ఖాన్ నే కాదు సల్మాన్ ఖాన్ తో పనిచేసే నటీనటులు, దర్శక నిర్మాతలను చంపేస్తాము. కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్ లోఇటీవల కాల్పులు జరిగాయి. ఇందుకు కారణం కపిల్ శర్మ షోకి సల్మాన్ ఖాన్ ని ఆహ్వానించడమే అంటూ హెచ్చరికలు జారీ చేసారు. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది.
పోలీసులు ఆ ఆడియో క్లిప్ ని ఆధారంగా తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ వార్నింగ్ లో సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లో పనిచేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనే సందేహం నెలకొంది.
Also Read : Ananya nagalla : అనన్య నాగళ్ళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..