Anchor Ravi : పెద్ద డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్న వేషం అయినా ఇమ్మని అడిగా.. ఆయన ఏమన్నాడంటే..
రవికి సినిమా ఛాన్సులు ఎందుకు రావట్లేదు, ప్రయత్నిచలేదా అని అడగ్గా రవి సమాధానమిస్తూ..

Anchor Ravi
Anchor Ravi : యాంకర్ రవి అనేక షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో యూట్యూబ్ వీడియోలతో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో రవికి సినిమా ఛాన్సులు ఎందుకు రావట్లేదు, ప్రయత్నిచలేదా అని అడగ్గా రవి సమాధానమిస్తూ.. నేను ప్రయత్నించాను. అందరికి తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరకు కూడా వెళ్లి చిన్న రోల్ అయినా చాలు సర్ మీ సినిమాలో ఇవ్వండి చేస్తాను అని అడిగా. దానికి ఆయన మీరంతా టీవీ లో ఓవర్ గా ఎక్స్‌పోజ్ అయ్యారు. మీరు అందరికి తెలుసు. అందుకే ఇవ్వలేను. నేను నీకు ఒక పాత్ర ఇస్తే అందరూ వచ్చి రవి అని చూస్తారు కానీ ఆ పాత్రను చూడరు అన్నారని తెలిపాడు. అయితే ఆ పెద్ద డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.
Also Read : Ananya nagalla : అనన్య నాగళ్ళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
అలాగే.. సినిమా స్టార్లు కేవలం సినిమా రిలీజ్ ముందే కనపడతారు. ఆ తర్వాత ఎక్కువగా కనపడరు బయట. అందుకే వాళ్లకు అంత క్రేజ్. మేము టీవీలో, యూట్యూబ్ ఛానల్ లో, సోషల్ మీడియాలో రోజూ కనిపిస్తాము అందుకే అందరికి మేము ఈజీగా కనెక్ట్ అవుతాము. కొత్తగా సినిమా పాత్రల్లో చూడాలంటే కష్టం అని అన్నారు.