బాలయ్యకు బ్యూటీ దొరికేసింది!

  • Published By: sekhar ,Published On : November 10, 2020 / 11:21 AM IST
బాలయ్యకు బ్యూటీ దొరికేసింది!

Updated On : November 10, 2020 / 11:30 AM IST

#BB3 -Sayyeshaa: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్)..ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన #BB3 First Roar వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.



ఈ సినిమాలో కథానాయికగా మలయాళీ ముద్దుగుమ్మ Pragaya Martin, మెయిన్ విలన్‌గా రియల్ హీరో Sonu Sood ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి కానీ మూవీ టీం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీలో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ Sayyeshaa (సయేషా సైగల్‌) నటించనుందని.. చిత్రబృందంలోకి ఆమెకు స్వాగతం తెలుపుతూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.




https://10tv.in/pragaya-martin-confirmed-as-female-lead-in-balayya-boyapatis-film/
అయితే ఆమెది హీరోయిన్ క్యారెక్టరా లేదా అనేది రివీల్ చేయలేదు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.