జనాల చూపుల్లో మార్పు రావాలి.. దీపికా పదుకొనే

  • Publish Date - January 8, 2020 / 06:43 AM IST

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. జనవరి 10వ తేదీన విడుదల కానుంది. అయితే దీపికా, ఛపక్ టీం కలిసి యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో మనకు చూపించేందుకు  సరికొత్త ప్రయోగం చేసింది. 

యాసిడ్ దాడి బాధితులు బయటకు వెళితే..రకరకాల మాటలు, అవమానాలు, వింత చూపులు వంటి ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. మరి ఆ అవమానాలు ఎంత ఘోరంగా ఉంటాయో మనకు చూపించేందుకు దీపికా చేసిన ప్రయోగం మీరు చూడండి. సూపర్‌ మార్కెట్‌, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపుల్లో రహస్యంగా కెమెరాలు ఉంచారు. అక్కడికి దీపిక, మరికొంత మంది యాసిడ్‌ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌ కు వెళ్లారు. దుకాణాల్లో వీరిని చూసి కొందరు చిరాకు, విసుగు తెచ్చుకున్నారు.

అయితే ఈ అవమానాలను నేరుగా అనుభవించిన దీపికా.. సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటూ తెలిపింది. బాధితుల పట్ల సమాజం అలా ప్రవర్తించడం చాలా తప్పు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.