What is the Issue Between Ram and Director Anil Ravipudi Here the Details
Anil Ravipudi – Ram : డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 280 కోట్ల గ్రాస్ దాటగా త్వరలో 300 కోట్ల గ్రాస్ వసూలు చేయబోతుంది. మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సినిమాలు హిట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.
అయితే గతంలో అనిల్ రావిపూడి హీరో రామ్ తో ఓ సినిమా చేయాలి. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అనిల్ రావిపూడి రామ్ చేసిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో సినిమాలకు రచయితగా పనిచేసాడు. అనిల్ రావిపూడి రెండు సినిమాల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్ తోనే చేయాలనుకున్నాడట. కథ కూడా ఓకే అయి ప్రొడక్షన్ కూడా మొదలయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. ఆ కథనే కాస్త మార్చి తర్వాత రవితేజతో చేసారు. రామ్ తో ఉన్న ఇష్యూ గురించి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అనిల్ రావిపూడి రామ్ తో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుతూ.. రామ్ తో నాకు ఎలాంటి ఇష్యుస్ లేవు. రామ్ నాకు చాలా క్లోజ్. కందిరీగ సినిమా నుంచి నాకు పరిచయం. మంచి ఫ్రెండ్. రామ్ తో నేను రాజా ది గ్రేట్ సినిమా చేయాలి. రవితేజ కంటే ముందు రాజా ది గ్రేట్ సినిమా రామ్ కే చెప్పాను. రామ్ కూడా ఓకే అన్నాడు. అప్పుడు రాజా ది గ్రేట్ కథ కొంచెం వేరు. రవితేజతో చేసిన కథ వేరు. రామ్ తో లవ్ ప్లస్ యాక్షన్ అనుకున్నాం. విజువల్లీ ఛాలెంజెడ్ పర్సన్ ప్రేమలో పడి ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లమ్ వస్తే ఏం చేసాడు అనే కథ రామ్ తో చేయాలి అనుకున్నా.
మొదట ప్రొడక్షన్ కంపెనీతో కొన్ని సమస్యలు వచ్చాయి. అది సెట్ అయ్యేలోపు అప్పుడే రామ్ హైపర్ సినిమా రిలీజయింది. దాంతో అప్పుడే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్, యాక్షన్ సినిమాలు చేయడానికి రామ్ ఆలోచించారు. అనిల్ మనం తర్వాత చేద్దాం నాకు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చేయాలని లేదు అని చెప్పారు. నేను కూడా ఓకే అన్నాను. ఇద్దరం ఓకే అనుకొనే ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాం. అంతే కానీ ఆయనకు నాకు ఏ గొడవలు లేవు. సెట్ అవ్వాల్సిన సినిమా అదే. అప్పుడు ఆగిపోయింది మరి మళ్ళీ రామ్ తో ఎప్పుడు చేస్తానో చూడాలి. రాజా ది గ్రేట్ రిలీజయ్యాక కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడారు రామ్ అని తెలిపారు.
మరి ప్రస్తుతం అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్, వరుస హిట్స్, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. రామ్ మాత్రం గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి సమయంలో రామ్ తో అనిల్ రావిపూడి సినిమా తీస్తాడా లేదా చూడాలి.