Sr NTR Car : సీనియర్ ఎన్టీఆర్ కార్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? డబ్బులిచ్చి గవర్నమెంట్ నుంచి కొనుక్కొని.. కార్ నెంబర్ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ తన కెరీర్లో పలు రకాల కార్స్ వాడారు. కానీ ఎన్టీఆర్ కి ఇష్టమైన కార్, ఎక్కువ రోజులు వాడిన కార్ ఒకటి ఉంది.

Sr NTR Car : సీనియర్ ఎన్టీఆర్ కార్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? డబ్బులిచ్చి గవర్నమెంట్ నుంచి కొనుక్కొని.. కార్ నెంబర్ ఏంటో తెలుసా?

Do You Know about Where is Senior NTR Favorite Car and Car Number Here the Details

Updated On : January 31, 2025 / 8:06 AM IST

Sr NTR Car : తన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించి, రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి తెలుగువారికి ఆరాధ్య దైవంగా మారారు ఎన్టీఆర్. ఇప్పటికి ఎన్టీఆర్ కు అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. సినిమాలు అయినా, రాజకీయాలు అయినా రోజూ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడో ఒకచోట వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకులు, కూతుళ్లు, మనవళ్ళు సినీ పరిశ్రమలో, రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఆయన గురించి, ఆయనకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది.

ఎన్టీఆర్ తన కెరీర్లో పలు రకాల కార్స్ వాడారు. కానీ ఎన్టీఆర్ కి ఇష్టమైన కార్, ఎక్కువ రోజులు వాడిన కార్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ ఓ అంబాసిడర్ కార్ ని చాలా రోజులు వాడారు. సీఎం అయ్యాక, ఆయన బతికున్నంతవరకు చివరి రోజుల్లో కూడా అదే కార్ ని వాడారు. ఆ కార్ అంటే ఆయనకు ఇష్టం. ఆ కార్ నంబర్ ABY 9999. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ కార్ గవర్నమెంట్ వద్ద ఉండిపోయింది. అయితే గవర్నమెంట్ అప్పుడప్పుడు పలు వస్తువులను వేలంపాట వేస్తుందని తెలిసిందే. అలా సీనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన అంబాసిడర్ కార్ ని కూడా వేలం వేసింది.

Also Read : Madha Gaja Raja : ‘మద గజ రాజ’ మూవీ రివ్యూ.. 12 ఏళ్ళ క్రితం సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..

ఆ వేలంపాటలో ఎన్టీఆర్ మనవడు, హీరో కళ్యాణ్ రామ్ ఆ కారుని కొనుక్కున్నాడు. తన తాతయ్య మీద ఉన్న ప్రేమతో కళ్యాణ్ రామ్ ABY9999 అంబాసిడర్ కారుని వేలంపాటలో పాడి డబ్బులిచ్చి కొనుక్కున్నాడు. ఆ కార్ ఇప్పటికి కళ్యాణ్ రామ్ ఆఫీసులోనే ఉంది, కళ్యాణ్ రామ్ ఆఫీస్ కి వెళ్ళగానే బయటే సీనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన ABY9999 అంబాసిడర్ కార్ ఉంటుంది. ఆయనకు గుర్తుగా కళ్యాణ్ రామ్ ఆ కార్ ని తనవద్దే ఉంచుకున్నారు. ఆయన ఆఫీస్ కి ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే కచ్చితంగా ఆ కార్ ని ఫోటో తీసుకుంటారు.

Do You Know about Where is Senior NTR Favorite Car and Car Number Here the Details

Also Read : Tollywood Heros : ఈ హీరోల‌ను విజ‌యం వ‌రించేది ఎన్న‌డో? సాలిడ్ సక్సెస్ కోసం వెయిటింగ్‌..

ఎన్టీఆర్ మరో మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత లాగే తన కార్స్ కి కూడా 9999 నంబర్ ఉండేలా చూసుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ 9999 నంబర్ కోసం చాలానే ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలిలో ఆ 9 సెంటిమెంట్ ఎక్కువే అంట. అందుకో ఆ ఫ్యామిలిలో మరికొంతమంది కార్లకు కూడా 9 వచ్చేలా నంబర్స్ ఉంటాయి.

Do You Know about Where is Senior NTR Favorite Car and Car Number Here the Details