Tollywood Heros : ఈ హీరోలను విజయం వరించేది ఎన్నడో? సాలిడ్ సక్సెస్ కోసం వెయిటింగ్..
మరికొంతమంది మాత్రం వరసపెట్టి ఫ్లాపులు అందుకుంటూ ..హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

tollywood heroes waiting for solid HIT
టాలీవుడ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నహీరోల్లో మ్యాగ్జిమమ్ హీరోలు సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. ప్రభాస్ దగ్గనుంచి సిద్థు జొన్నలగడ్డ వరకూ రేంజ్ తో సంబంధం లేకుండా ఎక్కువ మంది హీరోలు హిట్లతో కంటిన్యూ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వరసపెట్టి ఫ్లాపులు అందుకుంటూ ..హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. హిట్ కోసం వెయిట్ చేస్తున్నది ఎవరో చూద్దాం?
రవితేజ..
మిగతా హీరోలు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో కంటిన్యూ అవుతుంటే ..ఫ్లాప్ మారథాన్ చేస్తున్నారు రవితేజ. లాస్ట్ 5 ఏళ్లలో 10 సినిమాలు చేస్తే .. క్రాక్, ధమాకా ఈ రెండు సినిమాలే హిట్టయ్యాయి తప్ప..మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపే. సంవత్సరానికి మినిమం రెండు ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్న రవితేజ..ఈ సంవత్సరం మే లో రిలీజ్ అవుతున్న మాస్ జాతర తో అయినా హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు.
Monalisa : మోనాలిసా ఫస్ట్ ఫిల్మ్ సంతకం చేసేసింది.. హీరో, బడ్జెట్, రిలీజ్ డేట్.. ఫుల్ డిటెయిల్స్
గోపీచంద్..
మిడ్ రేంజ్ హీరోల్లో గోపీచంద్ కూడా హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. 10 ఏళ్లనుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు గోపీచంద్ . రిలీజైనసినిమాలన్నీ బిలో యావరేజ్ టాక్ తో కంటిన్యూ అవుతున్నాయి తప్ప..టాలీవుడ్ లో ఓ మాస్ కమర్షియల్ హీరోకి రావల్సిన సక్సెస్ మాత్రం రావడం లేదు గోపీచంద్ కి.
విజయ్ దేవరకొండ..
కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం ..ఈ మూడుసినిమాలూ తప్ప మిగిలిన సినిమాలన్నీ బిలో యావరేజ్ , ఫ్లాపుల్లో ఉన్నవే . 2018 దగ్గరనుంచి పట్టుమని హిట్ వచ్చిన సినిమా ఒక్కటికూడా లేదు . అయినాసరే హిట్ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనేఉన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ క్రేజీ హీరోకి హిట్ ఎప్పుడొస్తుందో ..
నాగచైతన్య..
నాగచైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడింపించేస్తున్నాడు కానీ ..ఇప్పటి వరకూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్నీ ఫ్లాపులే ఉండడంతో ఇప్పుడు కెరీర్ లో హిట్ కొట్టి తీరాల్సినపరిస్తితి. అందుకే ఈ సారి రిస్క్ చేసి మరీ దాదాపు 100కోట్ల ఖర్చుతో తండేల్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా అందని ద్రాక్షగా మారిన ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.
Pushpa 2 : OTTలోకి పుష్ప 2 వచ్చేసింది.. ఫుల్ లోడ్.. 23 నిమిషాలు ఎక్స్ ట్రా కూడా..
నితిన్..
నితిన్ కూడా 2020 లో వచ్చిన భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు . చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ ..ఇలా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాలు చేస్తున్న నితిన్ .. ఫ్లాపులకి బ్రేక్ పడేదెప్పుడో ..?
రామ్..
ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ .. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్..వరసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా..ఈ ప్లాపులకి మాత్రం బ్రేక్ పడటం లేదు రామ్ కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ హిట్ కోసం వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత స్కంద, రెడ్ , డబుల్ ఇస్మార్ట్ ..ఇలా వరసగా సినిమాలన్నీ ఫ్లాపే. మరి ఈసారి రామ్… సాగర్ గా అయినా మెప్పిస్తాడో లేదో ..?
వరుణ్ తేజ్ ..
ఈమధ్య కాలంలో ఈరేంజ్ డిజాస్టర్లు ఫేస్ చేసిన హీరో టాలీవుడ్ లో లేడేమో. 2019 లో వచ్చిన గద్దలకొండ గణేశ్ తర్వాతనుంచి ఈ 5 ఏళ్ల గ్యాప్ వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ , రీసెంట్ డిజాస్టర్ మట్కా. మట్కా సినిమాని ఏకంగా 50 కోట్లు బడ్జెట్ తో చేస్తే .. పట్టుమని 10 కోట్లు కూడా రాలేదంటే ఏరేంజ్ లో ప్లాపులు ఫేస్ చేస్తున్నాడో అర్దం చేస్కోవచ్చు. అయితే లేటెస్ట్ గా తన జానర్ మార్చి హార్రర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు తో రాబోతున్నాడు.ఈ సినిమా ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేసిన టీమ్ .. మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతోంది. ఇలా టాలీవుడ్ లో కొంతమంది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ లో ఉంటే..కొంతమంది మాత్రం హిట్ కోసం సంవత్సరాలనుంచి వెయిట్ చేస్తున్నారు. s
సిద్దు జొన్నలగడ్డ..
యంగ్ హీరోల్లో లేటెస్ట్ సెన్సేషన్. టిల్లు సినిమాతో స్టార్ట్ అయిన ఈ హీరో క్రేజ్ ని ఈ జనరేషన్ లో ఏ యంగ్ హీరోల క్యాచ్ చెయ్యలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు సిద్దు. 3 ఏళ్లక్రితం చిన్న సినిమాగా వచ్చిన టిల్లు తో 30కోట్ల కలెక్షన్లు రాబట్టిన సిద్దు .. లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లుస్క్వేర్ తో ఏకంగా 100కోట్ల కలెక్ట్ చేసి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకుని హిట్ ఫామ్ లో ఉన్నాడు.