Monalisa : మోనాలిసా ఫస్ట్ ఫిల్మ్ సంతకం చేసేసింది.. హీరో, బడ్జెట్, రిలీజ్ డేట్.. ఫుల్ డిటెయిల్స్
మోనాలిసా తన తొలి సినిమాకు సైన్ చేసింది.

Mahakumbh Mela viral girl Monalisa signs first film
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. అయితే.. ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది. త్వరలోనే ఆమె ఓ చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు తన తరువాతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వనున్నట్లు చెప్పాడు. అంతేకాదండోయ్ ఆయన స్వయంగా సదరు యువతి ఇంటికి వెళ్లి మరి ఈ విషయాన్ని చెప్పి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు.
పూసలు అమ్ముకునే మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. ఆమె అందానికి, తేనే కళ్లకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సెషన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను చూసేందుకు ప్రజలు ఎగబడడంతో ఆమెను తండ్రి స్వస్థలానికి పంపించేశాడు.
Pushpa 2 : OTTలోకి పుష్ప 2 వచ్చేసింది.. ఫుల్ లోడ్.. 23 నిమిషాలు ఎక్స్ ట్రా కూడా..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహేశ్వర్ మోనాలిసా స్వస్థలం. ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని ప్రఖ్యాత రచయిత-దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లాడు. అయితే.. ఆమె స్వగ్రామానికి వెళ్లిందని తెలుసుకున్నాడు. ఇండోర్‌లోని మహేశ్వర్ గ్రామానికి వెళ్లాడు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.
దర్శకుడితో మాట్లాడిన తరువాత మోనాలిసా కుటుంబం ఆమె నటించేందుకు ఒప్పుకుంది. డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పాడు. ఆమెకి యాక్టింగ్ క్లాసులు అవసరం అని తెలిపాడు. సినిమా షూటింగ్ ప్రారంభానికి మరో నెలరోజుల సమయం ఉందని, అప్పటి వరకు మోనాలిసాకు యాక్టింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఆమె పాత్రకు మంచి పేరు వస్తుందన్నాడు.
Rana daggubati : సినీ నటుడు రానా ఇంట్లో విషాదం.. పాడె మోసిన నటుడు..
కాగా దర్శకుడు సనోజ్ మిశ్రా.. మోనాలిసాతో పాటు ఆమె కుటుంబాన్ని కలిసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసా ఓ ఆర్మీ ఆఫీసర్ కూతురిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోంది.