Rana daggubati : సినీ న‌టుడు రానా ఇంట్లో విషాదం.. పాడె మోసిన న‌టుడు..

సినీ న‌టుడు రానా ఇంట్లో విషాదం నెల‌కొంది.

Rana daggubati : సినీ న‌టుడు రానా ఇంట్లో విషాదం.. పాడె మోసిన న‌టుడు..

Actor Rana daggubati Grandmother passed away

Updated On : January 30, 2025 / 11:01 AM IST

సినీ న‌టుడు రానా కుటుంబంలో విషాదం నెల‌కొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆమె అంత్య క్రియ‌ల‌ను బుధ‌వారం సొంతూరు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో నిర్వ‌హించారు.

సినీ నిర్మాత సురేష్‌, న‌టుడు రానా అంతిమ యాత్ర‌లో పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరి దేవి అమ్మ‌మ్మ అవుతారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అమ్మ‌మ్మ పాడె మోశారు. నిర్మాత సురేశ్ ఆమెకు అల్లుడు. అమ్మమ్మ పాడే మోస్తున్న రానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Star Heros : కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్న స్టార్ హీరోలు.. లుక్కే ముఖ్యం బిగిలూ..

సెలబ్రిటీలు అయినా సరే బంధాలకు, బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. రాజేశ్వ‌రి దేవికి భౌతిక‌కాయాన్ని ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంద‌ర్శించి నివాళులు అర్పించారు.

ఇక రానా విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న లీడ‌ర్ చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ బాష‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ముఖ్యంగా బాహుబ‌లిలో భ‌ల్లాల దేవ పాత్ర‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కాకుండా వెబ్ సిరీసులు, టాక్‌షోలో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. నిర్మాత‌గా కూడా రాణిస్తున్నారు. 2020 ఆగ‌స్టు 8న మిహికా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకున్నారు.

Ram Charan : బాబాయ్ లాగే అబ్బాయి కూడా.. చరణ్ RC16 సినిమాలో ఆ పని చేయబోతున్నాడా?