Ram Charan : బాబాయ్ లాగే అబ్బాయి కూడా.. చరణ్ RC16 సినిమాలో ఆ పని చేయబోతున్నాడా?

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

Ram Charan : బాబాయ్ లాగే అబ్బాయి కూడా.. చరణ్ RC16 సినిమాలో ఆ పని చేయబోతున్నాడా?

After Pawan Kalyan Ram Charan will Singing in RC 16 Movie Rumors Goes Viral

Updated On : January 29, 2025 / 9:37 PM IST

Ram Charan : : సినిమా సక్సెస్ కోసం అన్ని ఎలిమెంట్స్ వాడుతారు డైరెక్టర్లు, హీరోలు. ఏ అవకాశాన్ని వదులుకోరు. ఫ్యాన్‌ బేస్‌ను, మూవీ సబ్జెక్ట్‌ను బట్టి హీరో లుక్‌, బేస్‌ వాయిస్‌ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటారు. అప్పుడప్పుడు కొందరు హీరోలు తమ మూవీస్‌లో సాంగ్స్‌ కూడా పాడుతున్నారు. గతంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ఇటీవల వెంకటేష్.. ఇలా పలువురు హీరోలు తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో పాడిన సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు రామ్‌చరణ్‌ కూడా తన సినిమాలో ఓ సాంగ్‌ పాడబోతున్నాడట. RC 16 సినిమాలో ఓ పాటకు తన గాత్రం వినిపించబోతున్నాడట. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ మైసూర్ లో అయిపోయింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అధికారికంగా అనౌన్స్.. రీ లోడెడ్ కి ఇంకో 3 నిముషాలు యాడ్ చేసి.. మళ్ళీ చూడాల్సిందే..

RC16 సినిమా విలేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా అని సమాచారం. అన్ని కుదిరితే దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు సాంగ్స్ ఇచ్చాడని టాక్. అయితే RC16లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను రామ్‌చరణ్ పాడుతున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ సినిమాల్లో ఓ సాంగ్ పాడి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.

ఇప్పుడు రామ్‌చరణ్ వంతు వచ్చిందంటున్నారు. ఇదే నిజమైతే గనక చరణ్‌ పాడే పాట ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు రామ్‌చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ ఫర్ఫామెన్స్‌ చూసిన ఫ్యాన్స్ చరణ్ సాంగ్‌ పాడితే ఎలా ఉంటుందోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ నిజమా కాదా అనేది పక్కన పెడితే RC16లో రామ్‌చరణ్ పాడితే మాత్రం పుల్ మీల్సే అంటున్నారు ఫ్యాన్స్‌.

Also Read : Chiranjeevi : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. ఇంతకంటే ఏం కావలి అంటూ చిరంజీవి తల్లి ఎమోషనల్..

ఇటీవల సంక్రాంతికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమాతో రాగా ఈ సినిమా మిశ్రమ ఫలితం అందుకుంది.