Pushpa 2 : పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అధికారికంగా అనౌన్స్.. రీ లోడెడ్ కి ఇంకో 3 నిముషాలు యాడ్ చేసి.. మళ్ళీ చూడాల్సిందే..
పుష్ప 2 తమ ఓటీటీలోకి త్వరలో వస్తుందని రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తుంది.

Pushpa 2 Movie OTT Release Date Officially Announced by Movie Unit
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇటీవల డిసెంబర్ 4న రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రిలీజయి 50 రోజులు దాటుతున్నా ఇంకా పలు థియేటర్స్ లో ఆడుతుంది. నార్త్ లో అయితే వీర లెవల్లో ఆడేస్తుంది పుష్ప 2 సినిమా. ఇటీవల జనవరి 17న రీ లోడెడ్ వర్షన్ అంటూ మరి కొన్ని సీన్స్ యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేసారు. దీంతో మరోసారి థియేటర్స్ కి వెళ్లారు ఫ్యాన్స్.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. పుష్ప 2 తమ ఓటీటీలోకి త్వరలో వస్తుందని రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తుంది. తాజాగా పుష్ప 2 మూవీ యూనిట్ అధికారికంగా ఓటీటీ రిలీజ్ ప్రకటించింది. పుష్ప 2 సినిమా రేపు జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే మూవీ యూనిట్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త కూడా చెప్పింది. ఇప్పటికే ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ లో 20 నిముషాలు జత చేసి రీ లోడెడ్ వర్షన్ అని రిలీజ్ చేయగా ఇప్పుడు ఓటీటీలో ఆ 20 నిమిషాలకు మరో మూడు నిముషాలు జతచేసి.. అంటే మొదట రిలీజ్ చేసిన సినిమాకు మొత్తం 23 నిమిషాల సీన్స్ కలిపి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆ మూడు నిముషాలు ఏంటి అని మళ్ళీ ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. రీ లోడెడ్ వర్షన్ చూడని వాళ్ళు ఓటీటీలో చూసేయండి.
Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥
Watch #Pushpa2 – Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix #WildFirePushpa
Icon Star @alluarjun… pic.twitter.com/hkQghCewWF
— Pushpa (@PushpaMovie) January 29, 2025
ఇక పుష్ప 2 సినిమా ఇప్పటివరకు 1850 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అధికారికంగానే ప్రకటించి బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిందని తెలిపారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 రోజులు దాటుతున్నా ఇంకా కలెక్షన్స్ పోస్టర్స్ వేయలేదు. ఫ్యాన్స్ అయితే 2000 కోట్ల కలెక్షన్స్ దాటేసింది, దంగల్ రికార్డులు కూడా బద్దలు కొట్టిందని అంటున్నా మూవీ యూనిట్ మాత్రం స్పందించలేదు. ఇటీవల పుష్ప 2 కలెక్షన్స్ వల్ల ఐటి అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, సుకుమార్ ఇల్లు, ఆఫీసులపై దాదాలు చేసిన సంగతి తెలిసిందే.