Pushpa 2 : OTTలోకి పుష్ప 2 వచ్చేసింది.. ఫుల్ లోడ్.. 23 నిమిషాలు ఎక్స్ ట్రా కూడా..

ఎప్పుడెప్పుడు పుష్ప 2 మూవీ ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎదురుచూస్తుండ‌గానే ఆ రోజు రానే వ‌చ్చింది.

Pushpa 2 : OTTలోకి పుష్ప 2 వచ్చేసింది.. ఫుల్ లోడ్.. 23 నిమిషాలు ఎక్స్ ట్రా కూడా..

Pushpa 2 Movie Streaming on Netflix from today with 23 extra minutes

Updated On : January 30, 2025 / 11:39 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ గ‌తేడాది డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. విడుదలై 50 రోజులు దాటినా కూడా ఇంకా ప‌లు థియేట‌ర్ల‌లో ఆడుతోంది. ఇక నార్త్‌లో అయితే చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక ఇటీవ‌ల జ‌న‌వ‌రి 17న‌ రీలోడెడ్ వ‌ర్ష‌న్ అంటూ మ‌రికొన్ని స‌న్నివేశాల‌ను యాడ్ చేసి విడుద‌ల చేశారు. దీంతో మ‌రోసారి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల బాట ప‌ట్టారు.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ రోజు రానే వ‌చ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్ల్స్‌లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ బాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. క‌న్న‌డలో మాత్రం త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు చెప్పింది.

Rana daggubati : సినీ న‌టుడు రానా ఇంట్లో విషాదం.. పాడె మోసిన న‌టుడు..


అంతేకాదండోయ్‌.. ప్రేక్ష‌కుల‌కు మ‌రో శుభ‌వార్త కూడా అందించింది. ఎడిటింగ్‌లో క‌ట్ చేసిన 20 నిమిషాల సీన్స్ జ‌త చేసి రీ లోడెడ్ వ‌ర్ష‌న్ అని రిలీజ్ చేయ‌గా ఇప్పుడు ఓటీటీలో ఆ 20 నిమిషాల‌కు తోడు మ‌రో మూడు నిమిషాల‌ను యాడ్ చేశారు. డిసెంబ‌ర్ 4న రిలీజ్ చేసిన మూవీకి మొత్తంగా 23 నిమిషాల సీన్స్‌ను జ‌త క‌లిపిన‌ట్లు తెలిపింది.

Hari Hara Veera Mallu : మాట వినాలి పాట‌ను ప‌వ‌న్ ఎలా పాడారో చూశారా? బీటీఎస్ వ‌చ్చేసింది..

సునీల్, అన‌సూయ‌, ఫ‌హ‌ద్ ఫాజిల్ లు కీల‌క పాత్ర‌లో న‌టించిన పుష్ప 2 ఇప్ప‌టికే రూ.1850 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించింది. బాహుబ‌లి 2 చిత్రం రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించింది. మైత్రీ మూవీ మేక్స‌ర్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. ఇక పుష్ప 3 కూడా ఉన్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.