Hari Hara Veera Mallu : మాట వినాలి పాటను పవన్ ఎలా పాడారో చూశారా? బీటీఎస్ వచ్చేసింది..
పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ బీటీఎస్ వచ్చేసింది.

Maata Vinaali BTS release from Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ పాడిన తొలి పాట ‘మాట వినాలి’ను విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
తాజాగా పవన్ పాడేటప్పుడు తీసిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మాట వినాలి బీటీఎస్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది కూడా వైరల్‌గా మారింది. పవన్ ఎంతో ఉత్సాహంగా, జోష్‌తో ఈ పాట పాడారు. ఈ పాట చిత్రీకరణ ఎంతో సరదా వాతావరణంలో జరిగినట్లుగా కనిపిస్తోంది.
మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. దాదాపు సగభాగం తెరకెక్కించిన తరువాత ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఆ తరువాత జ్యోతి కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.
రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ మూవీ?
సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. తొలి భాగం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.