రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ మూవీ?

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, సౌత్‌ సూపర్‌ స్టార్ రజినీ కాంత్‌ ఒకే సినిమాలో నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ మూవీ?

Rajinikanth Salman Khan Mulitstarrer

Updated On : January 29, 2025 / 10:19 AM IST

ప్యాన్‌ ఇండియా మూవీ అన్నా.. మల్టీస్టారర్‌ పిక్చర్‌ అయినా.. ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు ఆ కిక్కే వేరు. టాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్ కామన్‌ అయిపోయింది. సౌత్‌ సినిమాల్లో కూడా హీరోలు, మిగతా నటీనటులు కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పుడో రేర్‌ కాంబినేషన్‌ వెండితెర మీద కనిపించబోతుందట. బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, సౌత్‌ సూపర్‌ స్టార్ రజినీ కాంత్‌ ఒకే సినిమాలో నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

జవాన్ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో.. డైరెక్టర్‌ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట బాలీవుడ్ స్టార్స్. జవాన్ ఇచ్చిన కిక్‌తో మరోసారి షారుఖ్ ఖాన్ జవాన్‌-2కు ప్లాన్‌ చేసుకుంటున్నాడట. అయితే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Chiranjeevi – CM Revanth Reddy : స్టేజిపై మెగాస్టార్ కి బాటిల్ క్యాప్ తీసి నీళ్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్‌తో జైలర్-2 కూడా ఎనౌన్స్ చేసిన రజినీకాంత్‌..ఆ తర్వాత డైరెక్టర్‌ అట్లీతో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా మల్టీస్టారర్ మూవీ అంటున్నారు. డైరెక్టర్‌ అట్లీ తీయబోయే మల్టీస్టారర్ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రజినీకాంత్‌ ఇద్దరు నటించబోతున్నారని అంటున్నారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు మల్టీస్టారర్ మూవీలో కనిపించబోతున్నారనే గాసిప్స్‌తో ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి.

Jani Master : ఆ కేసులో జానీ మాస్టర్ కి మరో షాక్.. పిటిషన్ కొట్టేసిన కోర్టు.. నటి ఝాన్సీ పోస్ట్ వైరల్..

సల్మాన్ ఖాన్ కొన్ని సినిమాల్లో క్యామియోలు చేశాడు. ఇక రజినీకాంత్ కూడా ఈ మధ్య మల్టీస్టారర్ మూవీస్‌ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పాన్ ఇండియా లెవల్‌లో మల్టీస్టార్‌ సినిమా చేస్తే ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. మరి సల్మాన్ ఖాన్‌..రజనీ కాంబినేషన్‌లో మూవీ రాబోతుందా లేదా అనేది వేచి చూడాలి మరి.