Jani Master : ఆ కేసులో జానీ మాస్టర్ కి మరో షాక్.. పిటిషన్ కొట్టేసిన కోర్టు.. నటి ఝాన్సీ పోస్ట్ వైరల్..
తాజాగా ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్ అయిన నటి ఝాన్సీ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది.

Actress Jhansi said Film chamber of commerce wins case against Choreographer Jani Master
Jani Master : కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసారు. కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చాడు జానీ మాస్టర్. ప్రస్తుతం జానీ మాస్టర్ బయటే ఉండి మళ్ళీ తన పనుల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్ అయిన నటి ఝాన్సీ ఓ పోస్ట్ పెట్టింది.
ఝాన్సీ తన పోస్ట్ లో.. జిల్లా కోర్టులో ఛాంబర్స్ ఆదేశాలను సవాలు చేసిన కొరియోగ్రాఫర్ జానీ బాషాపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచింది. ఈ రోజు ఆయన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇది ఒక ముఖ్యమైన తీర్పు. పని చేసే స్థలాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఉందని రుజువైంది. ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అని తెలిపింది.
జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై ఆ కమిటీ విచారణ చేపట్టారు. జానీ మాస్టర్ ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించింది ఫిలిం ఛాంబర్. అయితే కేసు కోర్టులో ప్రూవ్ అవ్వకుండా ఎలా తప్పిస్తారని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం. ఇప్పుడు ఆ పిటిషన్ ని కోర్టు కొట్టివేయడంతో ఝాన్సీ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది.
జానీ మాస్టర్ కేసు ఏంటి..
జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని, పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేసాడని, వర్క్ ప్లేస్ లో ఇబ్బందులకు గురిచేశాడు అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ లోకి తీసుకొని విచారించారు. అనంతరం కొన్నాళ్ళు జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసు విషయంలో ఆ మహిళా కొరియోగ్రాఫర్ అన్ని తప్పుడు ఆరోపణలు చేసిందని జానీ మాస్టర్ భార్య మీడియా ముందు మాట్లాడింది. ప్రస్తుతం కేసు కోర్టులోనే నడుస్తుంది.
Also Read : Divi : అన్ని రోజులు డబ్బింగ్ చెప్పాను.. కానీ పుష్ప 2లో నా సీన్స్ తీసేసారు.. పుష్ప 3లో..
జానీ మాస్టర్ బయటకు వచ్చాక ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తూ మళ్ళీ తన వర్క్ లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ కేసు విషయం కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడను అని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత సంఘటనలను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు జానీ మాస్టర్.