Naga Chaitanya : వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇంట్లో నా పరువు పోతుంది..
తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ..

Naga Chaitanya Interesting Comments on Sobhita in Thandel Trailer Launch Event at Vizag
Naga Chaitanya : నాగ చైతన్య గత మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తండేల్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నేడు తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఏ సినిమా రిలీజ్ అయినా మొదట వైజాగ్ టాక్ కనుక్కుంటా. వైజాగ్ లో సినిమా ఆడితే ప్రపంచంలో ఎక్కడైనా ఆడుతుంది. వైజాగ్ నాకు ఎంత ఇష్టం అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో కూడా ఇప్పుడు వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్. తండేల్ సినిమాకు వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది అని అన్నారు. దీంతో చైతూ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Divi : అన్ని రోజులు డబ్బింగ్ చెప్పాను.. కానీ పుష్ప 2లో నా సీన్స్ తీసేసారు.. పుష్ప 3లో..
నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్లు సీక్రెట్ గా ప్రేమించుకొని ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. శోభిత వైజాగ్ అమ్మాయి కావడంతో ఈవెంట్లో సరదాగా ఈ వ్యాఖ్యలు చేసాడు. గతంలో నాగచైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకోగా పలు కారణాలతో విడిపోయారు. సమంతతో విడిపోయాక చైతూ శోభితని వివాహం చేసుకున్నాడు.
Also Read : Thandel Trailer : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టారుగా..
ఇక చైతూ కెరీర్లోనే తండేల్ సినిమాని భారీగా తెరకెక్కించారు. శ్రీకాకుళం మత్య్సకారుల నిజ జీవిత కథతో పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి పట్టుబడ్డ మత్స్యకారులు ఎలా తిరిగొచ్చారు అనే కథకు ప్రేమ కథ జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.