Chiranjeevi – CM Revanth Reddy : స్టేజిపై మెగాస్టార్ కి బాటిల్ క్యాప్ తీసి నీళ్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..
నేడు హైదరాబాద్ శివార్లలోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

CM Revanth Reddy Gives Water to Megastar Chiranjeevi on Stage Video goes Viral
Megastar Chiranjeevi – CM Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోట్లమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మాములు ప్రజలతో పాటు చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా.. ఇలా అన్ని రంగాల్లో సెలబ్రిటీల్లో కూడా మెగాస్టార్ కి అభిమానులు ఉన్నారు. అన్నయ్యని కలవాలని ఆరాటపడతారు, అన్నయ్యతో ఫోటో దిగాలని, మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా మెగాస్టార్ అంటే అభిమానమే.
తాజాగా నేడు హైదరాబాద్ శివార్లలోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్లో చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి వాటర్ బాటిల్ క్యాప్ తీసి మరీ నీళ్లు తాగమని అందించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అభిమానులు సీఎం రేవంత్ – చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉందని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని కామెంట్స్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. మీరు కూడా వీడియో చూడండి..
Also Read : Thandel Trailer : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టారుగా..
ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్‌తో 2000వ సంవత్సరం నుంచి నాకు పరిచయం ఉంది. అప్పట్లోనే ఈ పార్క్ గురించి చెప్పారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద మొక్కల్ని కొన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. ఆయన పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పార్కుని నిర్మించారు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని అడిగితే ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. షూటింగ్స్ కు, వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ ప్లేస్ బాగుంటుంది అన్నారు.