Jani Master : న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.. జానీ మాస్ట‌ర్ ట్వీట్‌.. ఆమెకు కౌంట‌ర్ ఇచ్చాడా?

జానీ మాస్ట‌ర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఆమెకు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లుగా అర్థం అవుతోంది.

Jani Master : న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.. జానీ మాస్ట‌ర్ ట్వీట్‌.. ఆమెకు కౌంట‌ర్ ఇచ్చాడా?

Jani Master Tweet Viral strong counter to her

Updated On : January 29, 2025 / 1:01 PM IST

న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుందని అంటూ జానీ మాస్ట‌ర్ ఓ ట్వీట్ చేశారు. స్వ‌లాభం కోసం కొంద‌రు కోర్టు ఆర్డ‌ర్ల‌పై కూడా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, వారిని చూస్తే జాలేస్తుంద‌న్నారు. ఓ కేసుకి సంబంధించి వ‌చ్చిన తీర్పును మ‌రో కేసుతో ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నార‌ని ఆరోపించారు. అస‌లు తీర్పు వివ‌రాలు బ‌య‌టికి వ‌చ్చిన రోజున వారి నిజ‌స్వ‌రూపం ఏంటో, దేనికోసం ఇలాంటి దుష్ప్ర‌చారం చేస్తున్నారో ప్ర‌జ‌లంద‌రికి అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఆ రోజు మ‌రెంతో దూరంలో లేద‌ని హెచ్చ‌రించారు.

‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.’ అని జానీ మాస్ట‌ర్ ట్వీట్ చేశారు.

రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ మూవీ?

ఆమెకు కౌంట‌ర్ ఇచ్చాడా?

కొన్నాళ్ల క్రితం జానీ మాస్ట‌ర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫ‌ర్ లైంగిక వేధింపుల కేసు పెట్ట‌గా పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. కొద్ది రోజులు జైల్లో ఉండి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు జానీ మాస్ట‌ర్‌. ప్ర‌స్తుతం త‌న ప‌నుల్లో బిజీగా అవ్వాల‌ని చూస్తున్నారు. అయితే.. మంగ‌ళ‌వారం ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్ అయిన నటి ఝాన్సీ ఓ పోస్ట్ పెట్టింది.

Chiranjeevi – CM Revanth Reddy : స్టేజిపై మెగాస్టార్ కి బాటిల్ క్యాప్ తీసి నీళ్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..

జిల్లా కోర్టులో ఛాంబర్స్ ఆదేశాలను సవాలు చేసిన కొరియోగ్రాఫర్ జానీ బాషాపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కేసు గెలిచిన‌ట్లుగా చెప్పింది. జానీ మాస్ట‌ర్ మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన‌ట్లు తెలిపింది. ఇది ఓ కీల‌క తీర్పు. పని చేసే స్థలాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఉందని రుజువైందన‌ట్లుగా పేర్కొంది. ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అని ఝాన్సీ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది.

కాగా.. ఝాన్సీ పెట్టిన పోస్ట్‌కు కౌంట‌ర్‌గానే జానీ మాస్ట‌ర్ పోస్ట్ చేసిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై ఆ కమిటీ విచారణ చేప‌ట్టి జానీ మాస్టర్ ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించింది. అయితే కేసు కోర్టులో ప్రూవ్ అవ్వకుండా త‌న‌ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ఎలా తప్పిస్తారని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం.