Maata Vinaali BTS release from Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ పాడిన తొలి పాట ‘మాట వినాలి’ను విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
తాజాగా పవన్ పాడేటప్పుడు తీసిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మాట వినాలి బీటీఎస్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది కూడా వైరల్‌గా మారింది. పవన్ ఎంతో ఉత్సాహంగా, జోష్‌తో ఈ పాట పాడారు. ఈ పాట చిత్రీకరణ ఎంతో సరదా వాతావరణంలో జరిగినట్లుగా కనిపిస్తోంది.
మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. దాదాపు సగభాగం తెరకెక్కించిన తరువాత ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఆ తరువాత జ్యోతి కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.
రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ మూవీ?
సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. తొలి భాగం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.