Siri Hanumanth : బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త బిజినెస్ మొదలుపెట్టిన సిరి హనుమంత్.. ఏం బిజినెస్? ఎక్కడో తెలుసా?
తాజాగా నటి సిరి హన్మంత్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త బిజినెస్ మొదలుపెడుతుంది.

Actress Siri Hanumanth Staring New Business with her Boyfriend Srihan Details Here
Siri Hanumanth : మన సెలబ్రిటీలు సినిమాలు, సీరియల్స్ లో వచ్చే ఫేమ్, డబ్బులతో బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. చాలా మంది చిన్న, పెద్ద సెలబ్రిటీలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడమో లేదా సొంతంగా బిజినెస్ పెట్టడమో చేస్తుంటారు. తాజాగా నటి సిరి హన్మంత్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త బిజినెస్ మొదలుపెడుతుంది.
సీరియల్స్, యూట్యూబ్ తో పాపులారిటీ తెచ్చుకున్న సిరి హన్మంతు బిగ్‌బాస్ తో మరింత ఫేమస్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఓ పక్కన యూట్యూబ్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటూనే సినిమాలు, సిరీస్ లలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఇక సిరి హన్మంత్.. నటుడు, యూట్యూబర్ అయిన శ్రీహాన్ తో ప్రేమలో ఉండి లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఓ బాబుని కూడా దత్తత తీసుకున్నారు.
ఇప్పుడు సిరి హన్మంత్, తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కలిసి సిరి సొంతూరు వైజాగ్ లో బ్యూటీ క్లినిక్ బిజినెస్ మొదలుపెట్టారు. HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనే పేరుతో ఈ బిజినెస్ స్థాపిస్తున్నారు. ఫిబ్రవరి 2న వైజాగ్ లో గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు. ఈ ఓపెనింగ్ కి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా తన మేకప్ క్లినిక్ గురించి అప్డేట్స్ ఇస్తుంది సిరి హన్మంత్.
Also Read : Madha Gaja Raja : ‘మద గజ రాజ’ మూవీ రివ్యూ.. 12 ఏళ్ళ క్రితం సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..
తన మేకప్ క్లినిక్ లో మేకప్ మాత్రమే కాకుండా, బ్యూటీ, స్కిన్ కి సంబంధించిన పలు ట్రీట్మెంట్స్ ఉండనున్నాయి. తన మేకప్ క్లినిక్ లో పని చేయడానికి ఎంప్లాయిస్ కావాలని పలువురికి జాబ్స్ కూడా ఇస్తుంది సిరి హన్మంత్. ఇప్పుడు వైజాగ్ లో ఓపెన్ చేస్తుండగా త్వరలో విజయవాడలో కూడా ఓపెన్ చేయనున్నారు. పలువురు సినీ, టీవీ, యూట్యూబ్ సెలబ్రిటీలు వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం సిరి – శ్రీహాన్ లివ్ ఇన్ లో ఉన్నా త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని కూడా తెలుస్తుంది. ఓ పక్క సినిమాలు, సిరీస్ లు, యూట్యూబ్ తో బిజీగానే ఉంటూ మరో పక్క బిజినెస్ కూడా మొదలుపెట్టి దూసుకుపోతుంది సిరి.