Daggubati Suresh Babu : సీఎంతో భేటీలో ఎలాంటి సానుకూల స్పందన వచ్చింది? మీరేం కోరారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు?

బయట అనుకుంటున్నట్లుగా ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య దూరం పెరగలేదు..

Daggubati Suresh Babu

Daggubati Suresh Babu : సినీ పరిశ్రమ పెద్దలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమపై రేవంత్ సర్కార్ సీరియస్ అవడం, అసెంబ్లీ వేదికగా సినీ పెద్దలపై సీఎం రేవంత్ విరుచుకుపడటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రితో సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో ఇంకా ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఇప్పుడు సినీ పరిశ్రమకు ఏం కావాలి? సీఎంతో భేటీలో ఎలాంటి సానుకూల స్పందన వచ్చింది? సినీ పెద్దలు కోరారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు మాటల్లో..

Also Read : బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు చిన్న అంశం.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు కామెంట్స్..

‘సీఎం రేవంత్ రెడ్డితో ఇంటరాక్షన్ చాలా బాగా జరిగింది. సినీ పరిశ్రమ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ ఏం ఆశిస్తోంది? అనే అంశంపై మాట్లాడుకున్నాం. చాలా పాజిటివ్ గా చర్చ నడిచింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు కృషి చేసి సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చింది.

ఇప్పుడు హైదరాబాద్ ను ఫిలిం మేకింగ్ కు గ్లోబల్ డెస్టినేషన్ చేయడం ఎలా? అన్నది సినీ పరిశ్రమ, ప్రభుత్వం కోరిక కూడా. అది జరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దాని మీద ఫోకస్ చేస్తామని సీఎం చెప్పారు. నో డ్రగ్స్, ఎకో టూరిజం, యువతను ఎడ్యుకేట్ చేయడం.. ఈ అంశాలపై సినీ పరిశ్రమ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బయట అనుకుంటున్నట్లుగా ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య దూరం పెరగలేదు’ అని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు వెల్లడించారు.

CM Revanth Reddy Tollywood Meet (Photo Credit : Facebook)

బెనిఫిట్ షోలు ఉండాలా? టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉందా?
‘సినీ పరిశ్రమ స్కిల్ సెట్ ని పెంచుకోవాలి. కష్టపడకుండా ఏదీ రాదు. కల్కి, పుష్ప సినిమాల వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంది. రాజమౌళి లాంటి దర్శకులు టాలీవుడ్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇది వారి స్కిల్ వల్లే సాధ్యమైంది. 24 క్రాఫ్ట్స్ లో ప్రతి క్రాఫ్ట్.. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కిల్ సెట్ ని పెంచుకోవడం. నాకు అన్నీ వచ్చు, నేను పెద్ద తోపు అనుకుంటే ఎవరికీ ఏమీ రాదు. నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్లు ఈ ఫీల్డ్ లో సర్వైవ్ అవుతున్నారు.

సినిమాపై ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్ చేసిన నిర్మాతలకు టికెట్ల రేట్లు పెంచుకోవాలని ఉంటుంది. వారికి అది చాలా అవసరం. నాకు తమిళనాడు మోడల్ చాలా ఇష్టం. అక్కడ ఎగ్జిబిటర్లు ఒక అప్పర్ ధర ఫిక్స్ చేసేసి, మిగతావన్నీ తక్కువ ధరలో ఉంచుతారు. శుక్ర, శని, ఆదివారాలు లేదా ఓపెనింగ్ వీక్ లో టికెట్ ను అధిక ధరకు అమ్ముకోవడం.. మిగతా రోజుల్లో కావాలంటే తక్కువ ధరకు టికెట్ అమ్ముకునే వెసులుబాటు పెట్టుకుంటారు. ఇది మంచి విధానం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే అన్ని వర్గాల వారికి టికెట్ ధరలు అందుబాటులో ఉంచినట్లు అవుతుంది’ అని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.

పూర్తి వివరాలు..

Also Read : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..