ముప్ఫై దాటగానే!.. ‘గ్లీ’ నటుల మరణాల వెనుక సీక్రెట్ ఏంటి?

  • Published By: sekhar ,Published On : July 17, 2020 / 01:54 PM IST
ముప్ఫై దాటగానే!.. ‘గ్లీ’ నటుల మరణాల వెనుక సీక్రెట్ ఏంటి?

Updated On : July 17, 2020 / 3:17 PM IST

అమెరికన్ మ్యూజికల్ కామెడీ డ్రామా సిరీస్ ‘గ్లీ’ మంచి ఆదరణ దక్కించుకుంది. 1999లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆరు సీజన్లు రూపొందాయి. ఇందులో నటించిన నటీనటులకు ‘గ్లీ’ అనేది ఓ ఫ్లాట్‌ఫామ్‌లా నిలిచింది. అయితే ఇందులో నటించిన నటీనటుల మరణాల వెనకున్న మిస్టరీ మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా (Naya Rivera) మృతదేహాన్ని పెరూలేక్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే.

Naya Rivera

‘గ్లీ’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రివీరా. కొద్ది రోజుల క్రితం కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో ఓ బోటును అద్దెకు తీసుకుని తన నాలుగేళ్ల కుమారిడితో కలిసి బోటు షికారుకు వెళ్లిందామె. ఎంతకీ తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు గత బుధవారం బోటు కనిపించింది. దానిలో రివీరా కుమారుడు ఒక్కడే పడుకుని ఉన్నాడు. పిల్లాడి పక్కనే ఓ లైఫ్‌జాకెట్‌, రివీరా పర్స్‌ఉన్నాయి. ‘నేను, అమ్మ ఈత కొట్టడానికి వెళ్లాం. నేను తిరిగి వచ్చాను. కానీ అమ్మ ఇంకా రాలేదు’ అని పిల్లాడు రివీరా కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు పోలీసులు.

Naya Rivera kid

ఈ క్రమంలో ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. దాదాపు ఐదు రోజుల పాటు లేక్‌ను జల్లెడ పట్టిన తర్వాత పోలీసులు రివీరా మృతదేహాన్ని గుర్తించారు. ‘గ్లీ’ ఆరు సీజన్‌లలో రివీరా పాటలు పాడే చీర్‌లీడర్‌సంటాన లోపెజ్‌పాత్రలో నటించింది. అయితే దీనిలో నటించి.. ముప్సై ఏళ్లలోపు మరణించిన వారిలో రివీరా మూడో వ్యక్తి.

Mark Salling- Naya Rivera

ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో రివీరా సహనటుడు కోరి మాంటెయిత్‌31 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. మద్యం, హెరాయిన్‌కలిపి తీసుకోవడం వల్ల అతడు మరణించినట్లు​ పోలీసులు తెలిపారు. ‘గ్లీ’ చిత్రంలో తనతో పాటు నటించిన మార్క్‌సాలింగ్‌తో రివీరా కొద్ది రోజులు డేటింగ్‌చేసింది. అయితే అతడిపై చైల్డ్‌పోర్నోగ్రఫీ ఆరోపణలు రుజువు కావడంతో.. 2018లో తన 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.Cory Monteith