Aditi Rao Hydari : హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి భర్త ఎవరో తెలుసా?
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరిలు తెలంగాణ వనపర్తి లోని శ్రీరంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : September 19, 2024 / 12:14 PM IST
Who is Aditi Rao Hydari first husband
Aditi Rao Hydari -Siddharth : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరిలు తెలంగాణ వనపర్తి లోని శ్రీరంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అదితి రావుకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. అదితి మొదటి భర్త ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలను తెలుసుకునే పనిలో నెటిజన్లు నిమగ్నమయ్యారు.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టక ముందే అదితి రావు హైదరి సత్యదీప్ మిశ్రాను 2002లో పెళ్లి చేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2012లో విడిపోయారు. సత్యదీప్ మిశ్రా.. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా, కార్పొరేట్ లాయర్ గా కూడా పనిచేశారు.
Nagababu – Jani Master : నాగబాబు ట్వీట్.. జానీ మాస్టర్ ని ఉద్దేశించేనా..?
ఆ తరువాత ఆయన ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. చిల్లర పార్టీ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. సినిమాల ద్వారా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ బాట పట్టారు. పలు వెబ్‌సిరీస్‌ల్లో నటించారు.
ఇదిలా ఉంటే.. అదితితో విడిపోయాక సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి నీనా గుప్త కూతురు మసాబా గుప్తాను పెళ్లి చేసుకున్నాడు. కాగా.. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
Kanguva : ‘కంగువ’ రిలీజ్ డేట్ మారింది.. సూర్య పీరియాడిక్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
