Kanguva : ‘కంగువ’ రిలీజ్ డేట్ మారింది.. సూర్య పీరియాడిక్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా కంగువా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Kanguva : ‘కంగువ’ రిలీజ్ డేట్ మారింది.. సూర్య పీరియాడిక్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Suriya Kanguva Movie Release Date Announced

Updated On : September 19, 2024 / 11:59 AM IST

Kanguva : తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ అనే ఓ పీరియాడిక్ సినిమాతో రాబోతుండటంతో ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ వాళ్లకి ఇదే మొదటి 1000 కోట్ల సినిమా అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ నిర్మాణంలో కంగువ సినిమా భారీగా తెరకెక్కుతుంది.

Also Read : Kangana Ranaut : పాపం సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగ‌నా ర‌నౌత్‌..

అయితే కంగువ సినిమా దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ దసరాకు రజినీకాంత్ వెట్టయాన్ సినిమా ఉండటంతో కంగువా వాయిదా పడింది. తాజాగా కంగువా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కంగువ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ లో, దిశా పటాని హీరోయిన్ గా కనిపించబోతున్నారు.