Kangana Ranaut : పాపం సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగనా రనౌత్..
గతకొన్నాళ్లుగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

Kangana Ranaut Confirms Selling Mumbai Bungalow Because of Emergency Delay Losses
గతకొన్నాళ్లుగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఆమె దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ వాయిదా పడింది. అదే సమయంలో ఆమె తన బంగ్లాను విక్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న బంగ్లాను అమ్మేసినట్లు వచ్చిన వార్తలపై కంగనా స్పందించింది. ‘సహజంగా నా సినిమా(ఎమర్జెన్సీ) విడుదల కావాల్సి ఉంది. నా వ్యక్తిగత ఆస్తులన్నీ దానిపై పెట్టాను. సినిమా విడుదల కాలేదు. దీంతో ఆ బంగ్లా అమ్మక తప్పలేదు. ఆస్తులు అంటే నా దృష్టిలో అవసరమైన సమయాల్లో ఆదుకునేవి.’ అని కంగనా అంది.
Jani Master : జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
2017 సెప్టెంబర్ కంగనా ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా దీన్ని రూ.32 కోట్లకు విక్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ బంగ్లాను ఆమె నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయంగా ఉపయోగించారు.
ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ రాకపోవడంతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం అని అంది. ఇక ఈ చిత్రం బాయ్‌కాట్, బ్యాన్ కాల్‌లను కూడా ఎదుర్కొంటోంది. ఈ చిత్రం సమాజాన్ని తప్పుగా చూపిందని పలు సిక్కు సంస్థలు ఆరోపిస్తున్నాయి.