Jani Master : జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Police Find Jani Master and take into Custody
Jani Master : గత రెండు రోజులుగా జానీ మాస్టర్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేసాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు చర్చగా మరింది.
అయితే ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర్నుంచి జానీ మాస్టర్ కనపడట్లేదు. తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.