Jyothi Raj : జానీ మాస్టర్ కేసు.. మహిళా కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు.. కొంతమంది అమ్మాయిలు చట్టాలు ఉపయోగించుకొని..
మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Lady Choreographer Aata Sandeep Wife Jyothi Raj Comments on Jani Master Issue
Jyothi Raj – Jani Master : గత రెండు రోజులుగా జానకి మాస్టర్ కేసు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేసాడని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు తర్వాత ఇప్పటివరకు జానకి మాస్టర్ బయటకి రాకపోవడంతో అందరూ జానీ మాస్టర్ ని విమర్శిస్తున్నారు.
కానీ పలువురు.. రెండు వైపులా స్టోరీ తెలియకుండా, ఆరోపణలు ప్రూవ్ అవ్వకుండా ఫేమ్ ఉన్న ఒక వ్యక్తిపై మాటల దాడి చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆట సందీప్ భార్య, ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో డైరెక్ట్ గా జానీ మాస్టర్ కేసు అని చెప్పకుండా కేసుకు సంబంధించి ఇండైరెక్ట్ గా మాట్లాడింది జ్యోతిరాజ్.
Also Read : Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్.. సాయి ధరమ్ తేజ్ సినిమా ఆగిపోయిందా.. ?
ఈ వీడియోలో జ్యోతి రాజ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చాలా మందో ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. చాలామంది అమ్మాయిల గురించి ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్దవాళ్ళను అయినా వాళ్ళను వదలకూడదు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ తో లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు, వాళ్ళని కూడా శిక్షించాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్ ని మన వ్యూస్ కోసం, ఇంటర్వూస్ కోసం వాడొద్దు. తప్పు చేస్తే కచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కచ్చితంగా నిజం బయటకి వస్తుంది అని మాట్లాడింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.