Nagababu – Jani Master : నాగబాబు ట్వీట్.. జానీ మాస్టర్ ని ఉద్దేశించేనా..?

జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడగా తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేసారు.

Nagababu – Jani Master : నాగబాబు ట్వీట్.. జానీ మాస్టర్ ని ఉద్దేశించేనా..?

Nagababu Indirect Tweet on Jani Master Tweet goes Viral

Updated On : September 19, 2024 / 12:04 PM IST

Nagababu – Jani Master : గత రెండు రోజులుగా జానీ మాస్టర్ ఇష్యూ వైరల్ అవుతుంది. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఈ కేసు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.

Also Read : Jani Master : జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఇప్పటికే జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడగా తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేసారు. అయితే డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి ఏమి మాట్లాడకపోయినా ఆ ట్వీట్ చూస్తే జానీ మాస్టర్ కోసమే ఇండైరెక్ట్ గా వేసినట్టు ఉంది. నాగబాబు తన ట్వీట్ లో.. న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అని తెలిపారు. అయితే ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్టు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ అని తెలిపారు.

దీంతో నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో కూడా జానీ మాస్టర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ ని జనసేన పార్టీకి దూరంగా ఉండమని పార్టీ కూడా ఆదేశించింది.