Pushpa 2 : పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ను ఎవరెవరు.. ఏ భాషల్లో పాడారో తెలుసా..

పుష్ప 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది.

who sang Allu Arjun Pushpa 2 kissik song in which languages

Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చెయ్యగా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Also Read : Harikatha Telugu Trailer : ‘ఆ దేవుడే వస్తాడు’.. భయంకరంగా ‘హరికథ’ ట్రైలర్..

అయితే తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కిస్సిక్ పోస్టర్ విడుదల చేసారు. ఇక ఈ సాంగ్ లో శ్రీ లీల దుమ్ములేపనుంది. ఇదివరకే పుష్ప సినిమాలో సమంతతో ఓ స్పెషల్ సాంగ్ చేసారు. ఇక అప్పుడు ఊ అంటావా మావా ఉహు అంటావా మానా సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరోసారి ఇప్పుడు కిస్సిక్ తో అలరించడానికి రెడీ గా ఉన్నారు మేకర్స్.


ఇందులో భాగంగానే తాజాగా పుష్ప 2 లోని కిస్సిక్ పాటను ఏ భాషలో ఎవరు పాడారో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను.. తెలుగు, తమిళం, కన్నడ ఈ మూడు భాషల్లోనూ సుబ్లాషిని పాడారు. హిందీలో కూడా సుబ్లాషినితో పాటు లోహితా పాడారు. ఇక మలయాళంలో ప్రియా జెర్సన్ పాడారు. బెంగాలీలో సింగర్ ఉజ్జయిని ముఖర్జీ పాడారు. మరి ఇన్ని భాషల్లో ఇంతమంది మంచి సింగర్స్ పాడిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా అల్లు అర్జున్, శ్రీ లీల కలిసి స్టెప్పులేసి ఈ సాంగ్ నవంబర్ 24న రాత్రి 7:02 నిమిషాలకి రిలీజ్ కానుంది.