Harikatha Telugu Trailer : ‘ఆ దేవుడే వస్తాడు’.. భయంకరంగా ‘హరికథ’ ట్రైలర్..
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినీ ఆడియన్స్ అందరూ ఓటీటీలోనే సినిమాలు సిరీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీల్లో సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి.

Sriram RajendraPrasad Divi Harikatha Telugu Trailer
Harikatha Telugu Trailer : ఈ మధ్య కాలంలో చాలా వరకు సినీ ఆడియన్స్ అందరూ ఓటీటీలోనే సినిమాలు, సిరీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీల్లో సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి. చాలా వరకు చిన్న సినిమాలను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా నేరుగా ఓటీటీల్లో వస్తున్న సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
Also Read : Charith Maanas : మహేష్ మేనల్లుడి బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
అయితే ఇప్పుడు తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెరకెక్కుతున్న ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ హరికథ సంభవామి యుగే యుగే. పీరియడ్రికల్ బ్యాగ్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఇందులో శ్రీరామ్, విజయేంద్ర ప్రసాద్, బిగ్ బాస్ దివి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సిరీస్ డిసెంబర్ 13 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక ఈ సిరీస్ ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఇక ట్రైలర్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అధర్మం హద్దు మీరినప్పుడు.. అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ తో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక ఉర్లో వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ హత్యలను దేవుడే చేస్తున్నాడని అందరూ నమ్ముతారు.. అసలు ఆ హత్యలు ఎందుకు, ఎవరు చేసారో సిరీస్ లో చూడండి.