Charith Maanas : మహేష్ మేనల్లుడి బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్యామిలి నుండి ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు సుధీర్ బాబు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆయన మంచి గుర్తింపు తెచుకున్నారు.

Mahesh Babu Nephew Charith Maanas Birthday Celebrations
Charith Maanas : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్యామిలి నుండి ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు సుధీర్ బాబు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆయన మంచి గుర్తింపు తెచుకున్నారు. ఇటీవల మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ హీరో.
Also Read : Pushpa 2 : పుష్ప 2 తో అన్నపూర్ణ స్టూడియోస్ లింకప్.. దేనికో తెలుసా?
అయితే తాజాగా తన కొడుకు చరిత్ బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు. తన కొడుకు బర్త్ డే రోజు ఓ స్పెషల్ వీడియో సైతం షేర్ చేశారు. ఇక అందులో.. నీ స్పెషల్ డే రోజు నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నువ్వు రోజు రోజుకి ఇంత ఎత్తుకి ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెర్రీ అని పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక సుధీర్ బాబు కొడుకు చరిత్ సోషల్ మీడియా ద్వారా చాలా మందికి తెలిసే ఉంటుంది.మహేష్ బాబు మేనల్లుడు చరిత్ ఫోటోలు చూసి చాలా మంది నెటిజన్స్ అచ్చం మహేష్ బాబులా ఉన్నావని కామెంట్స్ పెడుతుంటారు. అంతేకాకుండా చరిత్ మానస్ ఇప్పటికే గతంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.